Tuesday, November 29, 2022

హత్య కేసును 48 గంటల్లో ఛేధించిన పోలీసులు

- Advertisement -

Police murder case cracked in car within 48 hours

 

హైదరాబాద్ : నగరంలో జరిగిన కారులో హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేధించారు. రియల్ ఎస్టేట్ లావాదేవిలో కమీషన్ కోసం సమీప బంధువే ప్రాణాలు తీశారని పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. ఇద్దరు నింధితులు నరేందర్ రెడ్డి, అబ్రహంలను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నింధితుడు నరేందర్ రెడ్డి స్థిరాస్తి ఏజెంట్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గతంలోను అతనిపై చీటింగ్ కేసు నమోదు అయింది. సమీప బంధువులైయిన విజయ్ భాస్కర్ రెడ్డి, నరేందర్ రెడ్డి స్థిరాస్తి పని చేస్తున్నారు. నరేందర్ రెడ్డిని, విజయ్ భాస్కర్ రెడ్డి తరచు అవమానించే వాడని కమిషన్ విషయంలో ఇద్దరి మధ్య తగాదాలు ఉన్నాయని పోలీసు కమీషనర్ తెలిపారు.

అతని పెద్దన్న కోడుకైన విజయ్ భాస్కర్ రెడ్డిని హత్య చేయాలని పతకం చేశాడు. 30 వేలతో రెండు నాటు తూఫాక్ లు కోనుగోలు చేసి ఈనెల 29న ఇంటి స్థలం ఉందని నరేందర్ రెడ్డి, విజయ్ భాస్కర్ కు ఫోన్ చేశాడు. ఇంట్లో నుంచి తొమ్మిదిన్నర లక్షలు తీసుకోని బయల్దేరగా మార్గమధ్యలో నరేందర్ రెడ్డి కారులోని ఎక్కాడు. ఆర్టీసి కాలని వైపు తీసుకెళ్లి నాటు తూఫాక్ తో కాల్చి చంపాడని సిపి అంజనీ కుమార్ వివరించారు. ఆ తరువాత నరేందర్ రెడ్డి డబ్బులు తీసుకొని పరిపోయాడు. తిరుమల గిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి చేధించారని ఆయన పేర్కొన్నారు. నింధితుడిని కస్టడిలోకి తీసుకొని విచారిస్తే మరింత సమాచారం బయటకు వస్తుందని సిపి వెల్లడించారు.

Police murder case cracked in car within 48 hours

Related Articles

- Advertisement -

Latest Articles