Home తాజా వార్తలు ప్రజలకు పోలీసుల పై గౌరవం పెరిగేలా పని చేయాలి

ప్రజలకు పోలీసుల పై గౌరవం పెరిగేలా పని చేయాలి

Police

 

నిర్మల్ : ప్రజలకు పోలీసులంటే గౌరవం పెరిగేలా పోలీస్ వ్యవస్థ పని చేయాలని జిల్లా ఎస్పి శశిధర్‌రాజు అన్నారు. సోమవారం ఎస్పి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. అనంతరం ఎస్పి శశిధర్‌రాజు మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలను ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు వారు మొదటగా తాగడానికి మంచినీరు ఇచ్చి, మర్యాదగా కూర్చోబెట్టి, ఓపిగ్గా వారి సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పట్టణ, గ్రామ, వివిధ కాలనీలల్లో ఎవరైన అనుమానితులు కనిపిస్తే వెంటనే జిల్లా వాట్సాప్ నెంబర్ 8333986939కు, లేదా 100కు డయల్ చేయాలన్నారు.

Police must work to make public feel Confident