Home అంతర్జాతీయ వార్తలు శ్రీలంకలో పోలీస్ అధికారి ఆత్మహత్య

శ్రీలంకలో పోలీస్ అధికారి ఆత్మహత్య

Police Officerకొలంబో: కొలంబోలో ఓ సీనియర్ పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు.  శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే అధికారిక నివాసంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారి దిల్‌రుక్ష సమరసింఘే గురువారం ఉదయం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కొలంబో పోలీసులు తెలిపారు.  స్పెషల్ టాస్క్‌ఫోర్స్ విభాగంలో సీనియర్ పోలీస్ కమాండోగా వ్యవహరిస్తున్న దిల్‌రుక్ష సమరసింఘే టెంపుల్ ట్రీకి సమీపంలో సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఆత్మహత్య చేసుకున్నారు. దిల్‌రుక్ష ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శవపరీక్ష నిమిత్తం దిల్‌రుక్ష మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Police Officer Commits Suicide in Sri Lanka