Home ఆంధ్రప్రదేశ్ వార్తలు మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దుపై పోలీసుల రివిజన్ పిటిషన్

మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దుపై పోలీసుల రివిజన్ పిటిషన్

Police revision petition against narayana bail revocation

 

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసుల తరఫున రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ప్రశ్నాపత్రాల లీకేజీలో కీలక అనుమానితుడైన నారయణ బెయిల్‌ను రద్దు చేయాలని చిత్తూరులోని జిల్లా న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. పదవ తరగతి ప్రశ్నా ప్రతాల లీకేజీ వ్యవహారంలో నారాయణకు న్యాయస్థానం మంజూరు చేసిన బెయిలు చట్ట విరుద్ధమని సుధాకర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ మంతిర నారాయణకు న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వుల రద్దుకు జిల్లా సెషన్స్ న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని పేర్కొన్నారు. ఈ కేసులో 435, 437, సెక్షన్ 18 పిఆర్‌సి కింద సొంత పూచీకత్తుపై న్యాయస్థానం బెయిలు ఇవ్వడం న్యాయబద్దంగా లేదన్నారు. కనీసం రిమాండ్ సైతం చేయలేదని, ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో కుట్ర పన్నడానికి ఛైర్మన్ పదవి అవసరం లేదన్నారు. ఈ కేసులో ముద్దాయిలు ఇచ్చిన వాంగ్మూలంలో నారాయణ పాత్ర చాలా స్పష్టంగా ఉందని ఆయన వివరించారు.

Police revision petition against narayana bail revocation