Thursday, April 25, 2024

గంజాయి, గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

గంజాయి, గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం

వరుసగా దాడులు చేస్తున్న సైబరాబాద్ పోలీసులు
సమాచారం ఉంటే 9490617444కు ఫోన్ చేయండి

Police ride on cannabis and gutka sales

మనతెలంగాణ, సిటిబ్యూరో: గంజాయి, గుట్కా విక్రయాలపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలో గంజాయి, గుట్కా, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మొపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పాన్‌షాపులు, కిరాణా దుకాణాలపై ప్రత్యేకంగా నిఘాపెట్టి విక్రయిస్తున్న వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఈ నెల 24,25వ తేదీల్లో పోలీసులు దాడులు చేసి గుట్కా, గంజాయి విక్రయిస్తున్న పదిమందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. గుట్కా విక్రయిస్తున్న ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. 49మందిపై ఈ పెట్టీ కేసులు పెట్టారు. పాన్‌షాపుల్లో రోల్ పేపర్ అమ్మకాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాల గురించి ప్రజలక అవగాహన కల్పిస్తున్నారు. గంజాయి, గుట్కా, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే సైబరాబాద్ పోలీసుల వాట్సాప్ నంబర్ 9490617444కు, లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News