Thursday, March 28, 2024

ఆత్మహత్యాయత్నం.. యువకుడిని కాపాడిన సిఐ సీతయ్య

- Advertisement -
- Advertisement -

వనపర్తి: భార్య చెప్పినట్టు వినడంలేదని ఓ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా సిఐ కాపాడిన సంఘటన వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రెవల్లి ప్రాంతానికి చెందిన భాస్కర్ భార్య లాక్‌డౌన్ నేపథ్యంలో తన పుట్టింటిలో ఉండిపోయింది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. భార్య తన మాట వినడంలేదని గ్రహించిన భర్త ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కొత్తపల్లి గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జి మీద నుంచి నీళ్లలో దూకబోతుండగా ఆత్మకూర్ సిఐ సీతయ్య అతడిని కాపాడాడు. కుటుంబ సభ్యులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించాడు. సిఐ సీతయ్యను ఉన్నతాధికారులు అభినందించారు.

 

Police save life of suicider in Wanaparthy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News