Home తాజా వార్తలు హవాలా

హవాలా

Police seize 7.71 crore hawala cash in Hyderabad

రూ.7.71 కోట్లు స్వాధీనం 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బుధవారం వేర్వేరు ప్రాంతాలలో  మొత్తం రూ.7.71కోట్లు హవాలా సొమ్ము స్వాధీనం చేసుకున్నారు.  పబ్లిక్ గార్డెన్ సమీపంలో కారులో తరలిస్తున్న రూ.5 కోట్లు, బంజారాహిల్స్, షాఇనాయత్ గంజ్ ప్రాంతాలలో రూ.2.71లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించ ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో హవాలా నగదు భావించి స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో ఓ అపార్ట్‌మెంట్‌లో రూ.5 కోట్లను పొలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన అధారాలు లేకపోవడంతో ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవదం జరిగింది. అలాగే సైఫాబాద్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఇద్దరు అనుమానితులు దొరికారు. వారి ఇచ్చిన సమాచారం మేరకు భారీ నగదును గుర్తించారు. అయితే తాము ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేస్తున్నామని పోలీసులకు నిందితులు వివరించారు.

ఇంత పెద్ద మొత్తంలో నగదును ఎక్కడి నుంచి తెచ్చారు? ఇంట్లో ఎందుకు దాచారన్న పోలీసుల ప్రశ్నలకు నిందితుల నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో నగదు వ్యవహారంలో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కపెంనీ సంబంధించిన వివరాలు లేకపోవడంతో రాజ్‌పురోహిత్, సునీల్‌కుమార్ అహుజ, అశీష్‌కుమార్ అహుజ, మహమ్మద్ అజాంలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వీరి నుంచి రివాల్వర్, వోల్వాకారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 171(బి), 468,471,420,120,(బి) సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ, ముంబై, నుంచి హవాలా మార్గంలో నగదును తీసుకోచ్చారని పోలీసులు వివరిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రాజకీయ నాయకులు ఎవరైనా డబ్బును తెప్పించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

Police seize 7.71 crore hawala cash in Hyderabad

Telangana Latest News