మనతెలంగాణ/సూర్యాపేట : ప్రభుత్వ నిషేధిత గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమీషనర్ అంజన్రావు తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ అసిస్టెంట్ కమీషనర్ శంబు ప్రసాద్, సూర్యాపేట జిల్లా ప్రొహిభిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి డి.శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్, డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ బృందాలు జిల్లా కేంద్రంలోని జనగామ క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. జనగామ చౌరస్తాలోని దాబాల వద్ద ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమీమ్ అహ్మద్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కన్పించడంతో పట్టుకొని విచారించగా గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. గంజాయి రవాణ, అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొని పిడి యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ దాడులలో ఏఈఎస్ భరత్ భూషణ్, ఎక్సైజ్ సిఐలు తిరుపతిరెడ్డి, వై.శ్రీనివాస్, కె.రాగవీణ, ఎస్సైలు రమేష్, మల్లెష్, సతీష్, సిబ్బంది, సాగర్, గపూర్, శేఖర్ రెడ్డి, నాగరాజు, బ్రహ్మం, రమేష్, రాంమూర్తి, నాగయ్య, క్రాంతి పాల్గొన్నారు.
Police seized by 10 kg cannabis in janagama x road