Home జాతీయ వార్తలు యుపిలో భారీగా నగదు సీజ్

యుపిలో భారీగా నగదు సీజ్

Money Seizedలక్నో : యుపి రాష్ట్రంలోని  బస్తీ డివిజన్‌లో  గురువారం పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఓ కారులో తరలిస్తున్న రూ. 24 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు కాంగ్రెస్‌ కు చెందిన ఎన్నికల కరపత్రాలు, ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. రాహుల్‌ గాంధీ ఫోటోతో కూడిన వాల్‌పోస్టర్లు కారులో లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ ఇలా భారీగా నగదు, బంగారం, మద్యం పట్టుబడుతోంది. లోక్ సభకు ఏడు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా పోలీసులు, ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే కోట్ల కొద్ది డబ్బు పట్టుబడింది.

Police Seized RS 24 Lakh Cash Frome Car at Basti in UP