Home నాగర్ కర్నూల్ ఖాకి చేతివాటం

ఖాకి చేతివాటం

చేతులుతడుపుకుంటున్న  ట్రాఫిక్ పోలీసులు
దిష్టి బొమ్మల్లా  సిసి కెమెరాలు
ఎదురుదాడికి పోలీసుల యత్నం

Police

నాగర్‌ కర్నూల్ ప్రతినిధి: జిల్లా కేంద్రంలో ట్రా ఫిక్ నియంత్రించి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు నియ మించిన ట్రాఫిక్ పోలీసులు తమ చేతివాటం చూపిస్తున్నారు. ట్రాఫిక్ ఎస్‌ఐ ఒక దగ్గర కొందరు కానిస్టేబుళ్లు మరోదగ్గర ఉండి వచ్చే పోయే  వాహనదారుల నుండి ఒక వైపు కేసులు రాస్తూనే మరో వైపు గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు వసూలు చేస్తు టో పిల్లో దాచుకుంటున్నారు. ఎవరైనా పోలీస్ చేతివాటంపై నిఘా పెట్టాలని చూస్తే వెంటనే సదరు ఖాకీలు హుషారయి ప్రతి దాడికి దిగుతున్నారు. నేరాల అదుపు కోసం ఎక్కడ ఏం జరుగుతుందో స్టేషన్‌లో కూర్చొని గమనించేందుకు ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు దిష్టి బొమ్మల్లా మారాయి.

నడిరోడ్డుపై పట్టపగలు బహిరం గంగా నిస్సిగ్గుగా పోలీసులు చేస్తున్న ఈ అక్ర మ వసూళ్ల భాగోతం పోలీస్ శాఖకే మచ్చగా మారింది. కొత్త జిల్లాలో పోలీసులపై ఉన్న గౌరవం కాస్తా మసకబారేలా వీరి చర్యలున్నా యి. నాగర్‌కర్నూల్ ట్రాఫిక్ పోలీసుల చేతి వాటం చాలా రోజులుగా కొనసాగుతుందన్న ఆరోపణలున్నాయి. శుక్రవారం నాగర్‌కర్నూ ల్ పట్టణంలో సంత కావటంతో పల్లెటూరి జనంతో రోడ్డు కిటకిటలాడుతుండగా ట్రాఫిక్ పోలీసులు ఇదే అదునుగా భావించారు. సరి గ్గా కూరగాయల మార్కెట్ గేటు బయట ట్రాఫిక్ ఎస్‌ఐ విక్రమ్ ద్విచక్ర వాహనంపై కూ ర్చొని చాలాన్లు రాస్తుండగా ఓ నలుగురు ఖాకీ లు రోడ్డు ఇరువైపులా వాహనాలు ఆపుతు న్నారు.

ఈ క్రమంలోనే వాహనదారుల నుండి పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు తీసుకొని టోపి చాటున దాచుకోవటం వంద లాది మంది ప్రజలు చూస్తు ముక్కున వేలు వేసుకున్నారు. కొందరు వ్యక్తులు అందించిన సమాచారం మేరకు మన తెలంగాణ విలేఖ రులు అక్కడికి చేరుకోని ఖాకీల చేతివాటం ఫో టోలు తీసేందుకు ప్రత్నిస్తుండగా ఖాకీలు తిర గబడి ఎస్‌ఐకి చెప్పడం మా విధులకు అడ్డంకి కల్గిస్తున్నావు, న్యూసెన్స్ కేసు బుక్ చేస్తా నంటూ బెదిరించడమే గాక విలేఖరి గుర్తింపు కార్డు కూడా లాక్కున్నారు. ఆపై ప్రజల ముందే నోటి దురుసు కూడా ౬పదర్శించి తమ తప్పులను కప్పిపుచుకునే యత్నం చేశారు. పోలీసులు ద్విచక్ర వాహనదారులే గాక, ఓ కా రు ఓనర్ నుండి కూడా డబ్బులు వసూలు చే స్తుండటం బహిరంగంగా జరుగుతుండటంతో అక్కడున్న పలువురు పోలీసుల వ్యవహారంపట్ల చీత్కరిచు కున్నారు.

ఖాకీ నేరం నిఘా నేత్రానికి కనిపించదా?

ట్రాఫిక్ నియంత్రణ, నేరాల అదుపు దర్యాప్తులో సమాచార సేకరణలో సాంకేతిక పరిజ్ఞానం విని యోగం లక్షంతో నాగర్‌కర్నూల్ పట్టణంలోని ప్రధాన రోడ్డులో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు దిష్టి బొమ్మల్లా మారాయి. నిఘా నేత్రాల నీడలో నే పోలీసులు తమ చేతి వాటం చూపిస్తుండటం తో నిఘా నేత్రాల పట్ల నేరస్థులలో ఉన్న భయం కాస్త తొలగిపోతుందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతుంది. కాగా నాగర్‌కర్నూల్ పోలీసుల వ్యవహారాల శైలి కొంత కాలంగా వివాదస్పదం గా మారుతుంది. తాము చేసే పనులను ప్రశ్నిం చ కుండా ఉండేందుకే బెదిరింపు ధోరణీలు, ఎదురు దాడులకు దిగుతున్నారన్న ఆరోపణ లున్నాయి.