Friday, March 29, 2024

ఐబి అధికారి శర్మ హత్య కుట్రే

- Advertisement -
- Advertisement -

Police to file chargesheet in murder case of IB officer

 

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ ఘర్షణలు, ఐబి అధికారి అంకిత్ శర్మ హత్య వెనుక తీవ్రస్థాయి కుట్ర ఉందని పోలీసు వర్గాలు స్థానిక కోర్టుకు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగిన ఈ ఘర్షణలపై ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసు వర్గాలు స్థానిక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రీచా పరిహార్ ఎదుట చార్జీషీట్ దాఖలు చేశాయి. అప్పటి హింసాత్మక ఘటనల క్రమం గురించి ఇందులో ప్రస్తావించారు. ఆప్ నుంచి సస్పెండయిన కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ నాయకత్వంలో ఓ గుంపు ఉద్ధేశపూర్వకంగానే ఇంటలిజెన్స్ అధికారి శర్మపై దాడికి దిగిందని తెలిపారు. ఆయనను తీవ్రంగా కొట్టి చంపి తరువాత భౌతికకాయాన్ని సమీపంలోని కాలువలో పడేశారని, తరువాతి రోజు దీనిని పోలీసులు వెలికితీశారని అభియోగపత్రంలో తెలిపారు.

క్రైంబ్రాంచ్ నివేదించిన అంశాల ప్రాతిపదికన విచారణకు కేసును ఈ నెల 16వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఘర్షణలు జరిగిన ప్రాంతంలో ఓ వరండాలో నిలబడ్డ వ్యక్తి తన సెల్‌ఫోన్ ద్వారా అక్కడి దృశ్యాలను చిత్రీకించినట్లు , ఆ వ్యక్తి ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి అయినట్లు పోలీసులు తెలిపారు. కొందరు వ్యక్తులు ఓ శవాన్ని మురికికాలువలో పడేయటం ఈ వీడియో దృశ్యాలలో ఉంది. అంకిత్ శర్మ శరీరంపై 51 వరకూ గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం దశలో గుర్తించారు. పదునైన మొండి మారణాయుధాలతో శర్మపై ఇష్టం వచ్చినట్లు దాడి జరిగిందని నిర్థారణ అయినట్లు క్రైంబ్రాంచ్ వర్గాలు తెలిపాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News