Home జయశంకర్ భూపాలపల్లి మేడారం భక్తులను రక్షించిన పోలీసులు

మేడారం భక్తులను రక్షించిన పోలీసులు

Medaram Devotees

 

ములుగు : ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం పస్రా, ప్రాజెక్టు నగర్ గ్రామాల మద్య జంపన్న వాగు లో చిక్కుకున్న భక్తులను కాపాడిన ములుగు డిఎస్పీ విజయ సారధి. వివరాల్లోకి వెళితే తాడ్వాయి మండలం మేడారం లోని సమ్మక్క, సారలమ్మ లను బుదవారం దర్శించుకుని తిరుగు ప్రయాణంలో వస్తున్న క్రమంలో ప్రాజెక్ట్ నగర్ వద్ద గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంపన్న వాగు ఉదృతంగా ప్రవహించడం తో వాగులో 23 మంది భక్తులు చిక్కుకున్నారు. దీంతో భక్తులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ములుగు డిఎస్పీ విజయ సారధి హుటాహుటినా అక్కడకు చేరుకుని పస్రా సిఐ శ్రీనివాస్, ఎస్సై మహెందర్ కుమార్ వారి సిబ్బంది, రెస్యూ టీం సభ్యుల సహకారంతో వాగులో చిక్కుకున్న భక్తులను వాగులోనుంచి రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. భక్తులను పోలీసులు రక్షించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా భక్తులను రక్షించిన డిఎస్పీ, సిఐ, ఎస్సై వారితో ఉన్న సిబ్బందిని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అభినందించారు.అనంతరం వారు మాట్లాడుతూ పోలీసులు కేసులు గ్రామాలల్లో గొడవలే కాకుండా ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్నాకాని ఆ ఆపదలోంచి కాపాడేవారే పోలీసులు అని అన్నారు.

Police who rescued the Medaram Devotees