Home తాజా వార్తలు పోలీసులు ప్రజల కోసమే పని చేస్తారు : ఎస్పీ శశిధర్ రాజు

పోలీసులు ప్రజల కోసమే పని చేస్తారు : ఎస్పీ శశిధర్ రాజు

SP Sasidhar Rajuనిర్మల్ ప్రతినిధి :  ప్రజల సంక్షేమం కోసమే పోలీసులు పని చేస్తున్నారని, సమాజంలో శాంతి భద్రత పరిరక్షణ కోసం పోలీసులు అంకితభావంతో పని చేయాలని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పేర్కొన్నారు.  సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదు విభాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. ఈ సందర్బంగా ఎస్పీ శశిధర్‌రాజు మాట్లాడారు. శాంతిభద్రతలకు సంబంధించి ప్రజలకు ఏవిధమైన సమస్యలు ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు.  అత్యంత సమయంలో 100కు డయల్ చేస్తే వెంటనే పోలీసులు అందుబాటులోకి వస్తారని ఆయన పేర్కొన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో, కాలనీల్లో గానీ ఎవరైన అనుమానితులు కనిపిస్తే వెంటనే దగ్గరల్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని, లేని పక్షంలో వాట్సాప్ నెంబర్ 8333986939ను సంప్రదించి సమాచారం ఇవ్వాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు.

Police Working For Public : Nirmal SP Sasidhar Raju