Home జోగులాంబ గద్వాల్ పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలి

పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలి

ఎంఎల్‌ఎ సంపత్‌కుమార్

Polio-vaccine

గద్వాల న్యూటౌన్: పల్స్‌పోలీయో కార్యక్రమంలో భాగంగా ఆదివారం అలంపూర్ ఎంఎల్‌ఎ సంపత్‌కుమార్ వడ్డెపల్లి మండల పరిధిలో శాంతినగర్‌లో జరిగిన పల్స్‌పోలియో కార్యక్రమం లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు పల్స్‌పోలియో గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. చిన్నపిల్లలు పోలియో బారిన పడకుండా ముందు జగ్రత్తగా పోలియో వ్యాక్సిన్‌ను వేయిం చుకో వాలన్నారు. అనంతరం చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కల ను వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునిత, వైద్యాధికారి సోఫియ, మాస్మిన్, షబ్బీర్ హుస్సేన్, కయూమ్, రాంబాబు, బీచుపల్లి, ఎఎన్‌ఎం కర్ణలు పాల్గొన్నారు.