Home ఎడిటోరియల్ రాజకీయాలు మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుండగా… మీ రాజకీయాలేమిటో నిర్ణయించుకోండి

రాజకీయాలు మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుండగా… మీ రాజకీయాలేమిటో నిర్ణయించుకోండి

అపరాజిత రాజా
అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్, జెఎన్‌యు శాఖ అధ్యక్షురాలు
సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి డి.రాజా కుమార్తె.
ఆమెతో సంజయ్ కా ఇంటర్వూను చదవండి.

యూనివర్సిటీ వాతావరణం ప్రగతిశీలంగా, అన్ని రకాల ఆలోచనలకు అవకాశం ఉండేదిగా ఉండాలి. ఉన్నత విద్యలో ప్ర తిభకు పేరుగాంచిన మా యూనివర్సిటీలో చదువుతున్న అందరం యు వక మనస్కులం. మా గొంతునొక్కివేయటానికి రాజ్యయంత్రం సర్వ శక్తిని వినియోగించటం తీవ్రమైన సమస్య.

జెఎన్‌యు లాగా మరే యూని వర్సిటీ యూనివర్సిటీ  దిగ్బం ధానికి గురి కాలేదు. దేశ వ్యతిరేక శక్తుల అడ్డాగా యూనివర్సిటీకి ముద్ర వేయటానికి కొన్ని ఫాసిస్టు శక్తులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి….. మేము దేశద్రోహులంకాదు. మావి హేతుబద్ధంగా ఆలోచించే మన స్సులు. మా స్వేచ్ఛను రాజ్యం కుదించజాలదు.

JNU-1జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదంపై మీ అభిప్రాయం?
అది మా యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘించటంగా అ ంద రం భావిస్తున్నాం. మొత్తం ఉదంతం అది హేతుబద్ధమైన, ప్రగతిశీల యూ నివర్సిటీ అనే భావనకు ముప్పు తెచ్చింది. ఆలోచనలను మూస కట్టు చేయాలని, కొన్ని గొంతులు నొక్కి వేయాలని ఫాసిస్టు ప్రభుత్వం కోరు కుంటున్నది. యూనివర్సిటీ వాతావరణం ప్రగతిశీలంగా, అన్ని రకాల ఆలోచనలకు అవకాశం ఉండేదిగా ఉండాలి. ఉన్నత విద్యలో ప్ర తిభకు పేరుగాంచిన మా యూనివర్సిటీలో చదువుతున్న అందరం యు వక మనస్కులం. మా గొంతునొక్కివేయటానికి రాజ్యయంత్రం సర్వ శక్తిని వినియోగించటం తీవ్రమైన సమస్య.
వివాదం జెఎన్‌యుకు చెడ్డపేరు తెచ్చిందని మీరు భావించటం లేదా?
మొత్తం ఉదంతం మమ్ము స్పాట్ లైట్‌లోకి తెచ్చింది. మీడియాలోని ఒక విభాగం కుమ్మక్కై మా క్యాంపస్ గూర్చి దురభిప్రాయాన్ని జాగ్రత్తగా నిర్మిస్తున్నది. మాకు వ్యతిరేకంగా స్పష్టంగా ప్రచారం జరుగుతున్నది. అ యితే మరికొందరు మాపై వ్యతిరేక ప్రచారాన్ని తటస్థీకరించారు. ఈనాడు భారతదేశం లోపలేగాక, ప్రపంచ వ్యాప్తంగా గల తటస్థశక్తుల నుంచి మాకు తోడ్పాటు లభిస్తున్నది. జెఎన్‌యు లాగా మరే యూని వర్సిటీ యూనివర్సిటీ దిగ్బంధానికి గురి కాలేదు. దేశ వ్యతిరేక శక్తుల అడ్డాగా యూనివర్సిటీకి ముద్ర వేయటానికి కొన్ని ఫాసిస్టు శక్తులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. జెఎన్‌యు జెర్సీలు ధరించిన విద్యార్థులు మెట్రో, ఇతర ప్రభుత్వ రవాణా బస్సుల్లో ప్రయాణించటానికి మొ ద ట్లో భయపడ్డారు. అయితే మా భావకప్రకటన స్వేచ్ఛపై కొనసాగు తున్న దాడి మాలో కృతనిశ్చయం పెంచింది; చిల్లర శక్తులపై తిరగబడా లను కున్నాం. మేము దేశద్రోహులంకాదు. మావి హేతుబద్ధంగా ఆలోచించే మన స్సులు. మా స్వేచ్ఛను రాజ్యం కుదించజాలదు.
ఫిబ్రవరి 9 నాటి వివాదస్పద సంఘటన గూర్చి మీరేమి చెబుతారు?
JNUచివర్లో నేనక్కడికి వెళ్లాను. ఆ ఘటన గూర్చి ప్రతి చిన్న విషయం ప్రచురించబడింది. అది సాంస్కృతిక సమావేశం అవునా, కాదా అని కొంత తప్పు రిపోర్టింగ్ కూడా జరిగింది. ఈ చర్చలోకి నేను రాదలచటం లేదు. అధికారులు ఒక సమావేశాన్ని మధ్యలో భగ్నం చేయటం ఇదే మొద టిసారి కాదు. మా క్రితం సమావేశాలు-మతకలహాలపై ముజఫర్ పూరీ బాకీ హై, అలాగే క్యాస్ట్ ఆన్ ది మెనూ కార్ట్, కోర్టు( ఈ చిత్రం ఆస్కార్స్‌కు భారత్ ఎంట్రీ) డాక్యుమెంటరీలు ప్రదర్శించిన సందర్భంలో వాటిని అధికారులు భగ్నం చేశారు. హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేములను, ముజఫర్ నగర్ మతకలహాలపై డాక్యుమెంటరీ ఫిలిం ప్రదర్శించటానికి అనుమతించలేదు. దీనిలో కచ్చితమైన ఒక రీతి ఉంది. మన ఫాసిస్టు ప్రభుత్వం హేతుబద్ధమైన గొంతులను అప్రజా స్వామికమైన పద్ధతిలో అణగదొక్కటానికి కంకణం కట్టుకుంది.
జెఎన్‌యు విద్యార్థి యూనియన్ ప్రెసిడెంట్ కన్హయ కుమార్‌కు బెయిలు మంజూరైన తదుపరి క్యాంపస్ ఎలా ఉందని భావిస్తున్నారు?
కుమార్‌కు బెయిల్ మా అందరికీ సంతోషదాయక క్షణం. మా కామ్రేడ్స్ మరో ఇద్దరు జైల్లో ఉన్నారు. సమస్యలపై పోరాటానికి మన రాజకీ యా లకు మరింత బలం కావాలి. రాజద్రోహ (సెడిషన్) చట్టం ఫాసిస్టు శక్తులకు రాజకీయ పనిముట్టుగా మారినందున, దాని హేతు బద్ధతను స వాలు చేయటానికి ఇది సరైన సమయం. మన ప్రభుత్వం ద ళిత వ్యతిరేకి మాత్రమే కాదు; ఆదివాసీలు, ఇతర మైనారిటీలకు కూడా వ్యతిరే కమైంది. మనం హోండా కార్మికుల హక్కుల గూర్చి మాట్లాడాలి. విద్యా రంగానికి ప్రభుత్వం చేసిన నామమాత్రపు బడ్జెటరీ కేటాయి ంపులకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. మేము త్వరలో ప్రారం భించనున్న అనేక పోరాటాల్లో ఇవి భాగం. వివిధ రంగాల్లోని ప్రజల హక్కుల గూర్చి మనం ఆలోచించాల్సిన సమయమెచ్చింది.
రాజకీయనాయకులు తమ స్వప్రయోజనాల కోసం జెఎన్‌యు వివాదాన్ని రాజకీయం చేస్తున్నారా?
జెఎన్‌యు సమస్యను రాజకీయం చేస్తున్నదెవరో ముందుగా మనం చూ డాలి. మేము ఆ పని చేయటం లేదు. మా రాజకీయ భావజాలాలు మా కు తెలుసు కాబట్టి మా అంతరాత్మ స్పష్టం . మమ్ము రాజకీయంగా సవా లు చేస్తున్నారు, దాన్ని రాజకీయంగా ఎదుర్కొంటాం. మన కేంద్ర మాన వవనరుల అభివృద్ధి శాఖామంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో 8 మంది విద్యార్థుల పేర్లు చదివారు. అందువల్ల దీన్ని రాజకీయం చేస్తున్న దెవరు?
కన్హయ కుమార్ ప్రసంగం తర్వాత విద్యార్థి రాజకీయాల్లో కొత్త ఉత్సాహం వచ్చింది….
తన యూనియన్ ఎన్నికల సమయంలో కుమార్, సమాజంలోని భిన్న విభాగాలకు చెందిన తక్షణ సమస్యలకు సంబంధించి స్థూలమైన ఏకాభిప్రాయం ఉండాలనే గట్టి పంథా ఎంచుకున్నారు. మా ప్రాథమిక స్థూల ఏకాభిప్రాయం ఫాసిస్టుశక్తులను వెనక్కుకొట్టే పోరాటం చేయటం.
ప్రస్తుతం జరుగుతున్న అసహనం చర్చ గూర్చి మీరేమంటారు?
ఇది చాలా తీవ్రమైన సమస్య, ఇది కొత్తదేమికాదు. అయితే దారుణ మేమంటే, కాషాయబ్రిగేడ్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచిదేశంలో అసహనం వేగంగా వృద్ధి చెందుతున్నది. నరికారు, మాన భంగం చేశారు అనే వార్తలు నిత్యం వస్తున్నాయి. వివిధ ప్రదేశాల్లో మత కల హాలు జరుగుతున్నాయి. ఖాప్ పంచాయతీలు చట్టాన్ని తమ చేతి లోకి తీసుకుంటున్నాయి. ఫాసిస్టు ప్రభుత్వంతో ఇప్పటికీ మనం పోరా డగలం. కాని మన సమాజమే ఫాసిస్టుగా తయారైతే అది దేశానికి అత్యంత ప్రమాదకరం.
ఈనాటి విద్యార్థి రాజకీయాలను మీరెలా చూస్తున్నారు!
గత సంవత్సర కాలంలో విద్యార్థి ఉద్యమాలు పెరిగాయి. అంతర్ విశ్వ విద్యాలయ సంఘీభావం పాలుపంచుకునే రూపంలో ముందు పీఠీకి వచ్చింది. రోహిత్ దేశంలోని ప్రతి ఒక్కరి హృదయాన్ని కది లిం చాడు. మనది యువక దేశం. అందువల్ల విద్యార్థులు విప్లవాత్మక పాత్ర పోషించాలి.
మీరు నాలుగేళ్ల క్రితం క్యాంపస్‌లో చేరారు. మార్పును ఇప్పుడెలా చూస్తున్నారు?
JNU-Protestజెఎన్‌యు ఎప్పుడూ ఇలాగే ఉంది. పాలస్తీనా, ప్రపంచ దారిద్య్రం, ఇత ర అత్యవసర ప్రపంచ సమస్యలపై మా యూనియన్‌లు గతంలో తీర్మా నాలు ఆమోదించాయి. అయితే మాపై దాడి తీవ్రమైనందున, మా శత్రు వులను ఎదుర్కొనటానికి మేమూ మరింత బలంపుంజుకున్నాం. రాజకీ యాలు మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తున్నప్పుడు, మీ రాజకీయా లేమిటో నిర్ణయించుకోండి.
జెఎన్‌యు ఉన్నతాధికార కమిటీ కుమార్‌ను, మరో ఐదుగుర్ని యూనివర్సిటీ నుంచి తొలగించినట్లు (రస్టికేషన్) చెప్పబడుతున్నది. మీరు అధికారులను ఎలా ఎదుర్కోబోతున్నారు?
ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీగా పిలవబడుతున్నది సహజన్యా యక్ర మాన్ని అనుసరించలేదు. విద్యార్థులపై మోపిన ఆరోపణలేమిటో అధి కారులు మాకు చెప్పటం లేదు. దర్యాప్తు కమిటీ పరిధి ఏమిటో కూ డా మాకు తెలియదు. సత్యమేమిటో తెలుసుకోవటానికి పక్షపా తరహిత దర్యాప్తు జరగాలన్నది మా డిమాండ్.
కుమార్ వామపక్ష, అంబేద్కరైట్ రాజకీయాలు రెండూ మాట్లాడు తున్నారు….
kanvayaభారతదేశంలో ఫాసిజాన్ని, బ్రహ్మణీకవ్యవస్థను, పెట్టుబడిదారీ వ్యవ స్థను ఎదిరించి పోరాడటంలో అంబేద్కరైట్, వామపక్షభావాల రాజకీ యాల మధ్య బలమైన సంఘీభావం ఉంది. స్థానిక స్థాయి ఉద్యమాల్లో ఈ శక్తులకు వ్యతిరేకంగా పోరాటంలో మేము పాల్గొనకుండా ఎన్నడూ లేము. అయితే జెఎన్‌యు వివాదం మాకు అదనపు శక్తినిచ్చింది! మా లౌకిక పంథా రాజకీయాలను మరింతగా వెలుగులోకి తెచ్చింది.
(‘డెక్కన్ క్రానికల్ సౌజన్యంతో-16.03.16)