Thursday, April 18, 2024

యూపిలో నాలుగోదశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Polling begins in UP for the fourth phase

 

లక్నో: యూపిలో  నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. 624 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు రంగంలో ఉన్నాయి. బందా, ఫతేపూర్, హర్ధోయ్,లఖింపూర్ ఖేర్, లక్నో, రాయ్‌బరేలీ, సీతాపూర్, పిలిభిత్, ఉన్నావ్‌లో పోలింగ్ జరుగుతుంది. ఇందులో రాయ్‌బరేలీ కాంగ్రెస్ కంచుకోట కాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇక్కడ నుంచని ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగోదశ ఎన్నికల్లో 167 మంది (27 శాతం) అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 129 మందిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కళంకితులకు ఎక్కువ సీట్లు ఇచ్చిన జాబితాలో కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు తొలివరుసలో ఉన్నాయి. 53 శాతం మంది చొప్పున రెండు పార్టీలు కళంకిత అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాయి. ఆ తరువాత స్థానంలో బీఎస్పీ 44 శాతం మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. బీజేపీ 40 శాతంతో నాలుగో స్థానంలో, 24 శాతంతో ఆమ్ ఆద్మీ ఐదోస్థానంలో నిలిచాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News