*రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
*కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు
* చివరి ఆయకట్టుకు వరకు నీరందిస్తాం
*ఐదేళ్ల పాలనలో పొన్నం చేసింది ఏమిటి..?
*జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
ఏనుగు రవీందర్‌రెడ్డి
మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: టిఆర్‌ఎస్ ప్రభుత్వం చే పడుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకుల నీతిమాలిన రాజకీయాలు చేస్తు ఆరోపణలు చేస్తున్నారని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రె డ్డి ఆరోపించారు. గురువారం నగరంలోని ఆర్‌అండ్‌బి అ తిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ నీతిమాలిన రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. రైతులను తప్పుదోవపట్టేలా జగిత్యాలఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి,మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్,పెద్దపల్లి జిల్లా విజయరమణరావు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మిడ్‌మానేరు నుంచి ఇతర ప్రాజెక్టుల ద్వారా మిడ్ మానేరుకు తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకొచ్చారని వీటిలో కొంత నీటితో చెరువు లు నింపినట్లు తెలిపారు. కెసిఆర్ తరలించుకపోతున్నారని ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు మూడు రోజులకు కుదించారని మరొకరు నీటిని తరలించకపోతు రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గతంలో 32 టిఎంసిల నీటిని వి డుదల చేసిన చివరి ఆయకట్టు వరకు నీరందని పరిస్థితి ఉ ండేదన్నారు.ఇప్పుడు ఉన్న 16 టిఎంసిల నీటిని విడుదల చేసినా చివరిఆయకట్టు వరకు నీరందని పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు ఉన్న 16 టిఎంసిల నీటితో చివరి ఆయక ట్టు వరకు ప్రణాళికతో అందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకొని పని చేస్తుంటే కాంగ్రెస్ నాయకులకు ఇది మిం గుడు పడక టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాయకుల పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాం గ్రెస్ పార్టీ నాయకులు టిఆర్‌ఎస్‌పై బురద జల్లుతున్నారన్నారు. ఎన్నో ఎళ్లు అధికారంలో ఉండి రైతులకు ఎలాంటి మేలు చేయని వారు నేడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉ ందన్నారు. రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం అనేక సంక్షే మ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. సిఎంను అసభ్య పదజాలంతోదూషించడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు.గతంలో కెసిఆర్ అసభ్యపదజాలం వాడిన వారిపై కేసులు నమోదుచేయాలని సూచించారన్నారు. దీంతో పొన్నం కెసిఆర్ దూషిస్తే తాను పాపులర్ అవుతానని కేసీఆర్‌ను దూ షి ంచి ప్రజల దృష్టిలోపలుచనయ్యారన్నారు.ఇలా సంచలనాలు సృష్టించ డం ద్వారా తనకు గుర్తింపు వస్తుందని పొన్నం భావిస్తున్నారని ఎద్దెవా చేశారు.గతంలో పొన్నం ప్రభాకర్ చేపట్టిన దీక్ష ఫెయిల్ అయినా అతనిలో మార్పు రాలేదన్నారు. ఐదేళ్ల పాలనలో కరీంనగర్‌కు ఎంపిగా ఉండి చేసింది ఏమిలేదని ఆరోపించారు.
రైతు సమన్వయ సమితీల ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించే రోజు ముందు ఉందని అప్పుడు తలదించుకునే పరిస్థితి పొన్నంకు వస్తుందన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలు ముద్ది చేప్పారని 2019లో కూడా ప్ర జలు బుద్ది చెప్పుతారన్నారు.
ఈ సమావేశంలో నాయకులు భూక్య తిరుపతి నాయక్, జక్కుల నాగరాజు,ఎం.డి.ఫహాద్, నేతికుంట హరీష్, వేణుమాధవ్,తేజ,సాయిమణిదీప్, శివ పాల్గొన్నారు.