Home తాజా వార్తలు గోదావరి జలాలతో చెరువులు నింపుతాం…

గోదావరి జలాలతో చెరువులు నింపుతాం…

 

పరిశ్రమల ఏర్పాటుతో
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు
త్వరలోనే సిద్దిపేటలో
రైలు కూత వినబడబోతోంది
మాజీ మంత్రి, ఎమ్మెల్యే
తన్నీరు హరీశ్‌రావు

 సిద్దిపేట రూరల్ : కాళేశ్వరం ప్రాజెక్టు ని ర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి గోదావరి జలాలతో చె రువులు, కుంటలను నిండు కుండల్లా నింపుతామని మాజీ మం త్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా గురువారం రాత్రి సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల్లోని ఎన్సాన్‌పల్లి, రాఘవపూర్ గ్రామాల్లో ఏర్పాటు చే సిన వేర్వేరు ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. త్వరలోనే గోదావరి జలాలను తీసుకువచ్చి పంట పోలాలను స స్యశ్యామలం చేస్తామన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మె జార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. దీంతో గ్రామాలన్ని అ భివృద్ధి పథంలో దూసుకుపోతాయన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీనిచ్చి ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజలకు తాను ఎం త చేసిన తక్కువేనన్నారు.

మీ కుటుంబంలో ఒకడిగా ఉంటూ నిరంతరం సేవలందిస్తానన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని అన్ని ర ంగాల్లో అభివృద్ధిపరుస్తున్నారన్నా రు. సిద్దిపేట ఇప్పటికే అనేక రం గాల్లో ఆదర్శంగా నిలిచిందన్నారు. త్వరలోనే పొన్నాల శివారులో ఎల్వీ ప్రసాద్ కం టి ఆస్పత్రి ఏర్పాటు కానుందన్నారు. రైల్వే లై న్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని త్వ రలోనే రైలు కూత సిద్దిపేటలో వినబడబోతోందన్నా రు. టిఆర్‌ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధిని చూసి తమ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధిని చూడడానికి ఇతర ప్రాంతాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చిపోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా ప్రాజెక్టుల ఖిల్లాగా మారిందన్నారు. హరీశ్‌రావు ప్రత్యేక చొరవతోనే సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ ప్రచార సభలో మునిసిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, సర్పంచులు బీఆర్ గౌడ్, ఉపసర్పంచ్ లక్ష్మి, సీనియర్ నాయకులు నిమ్మ జనార్ధన్‌రెడ్డి, నర్సయ్య, లక్ష్మమ్మ, రేణుక, శ్రీనివాస్ భాస్కర్, కమలాకర్‌రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Ponds are filled with Godavari waters