Home Default సంక్రాంతికి కోలీవుడ్ మూవీ

సంక్రాంతికి కోలీవుడ్ మూవీ

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మాస్టర్ విజయంతో మంచి ఊపులో ఉన్న దళపతి త్వరలో తన 65వ సినిమా మొదలుపెట్టనున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమం ముగించుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో మొదలు పెట్టనున్నట్లు టాక్. అయితే తొలిసారి దళపతి సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జతకట్టనుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించనున్నాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. విజయ్ 65వ సినిమాను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఫిల్మ్ మేకర్స్ ఉన్నట్లు తెలిసింది. ఎందుకంటే ఈ ఏడాది సంక్రాంతికి భారీ కలెక్షన్లు అందుకున్నాడు విజయ్.

అలాగే ఇదివరకు కూడా విజయ్ నటించిన సినిమాలు సంక్రాంతి టైంలో విడుదలై బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే ఈ సినిమాను చకచకా పూర్తి చేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడట దర్శకుడు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. హీరోయిన్ పూజాహెగ్డే కూడా తన కెరీర్లో ఇండస్ట్రీ హిట్ సంక్రాంతి టైంలోనే అందుకుంది. గత ఏడాది ‘అలవైకుంఠపురంలో’ సినిమాతో ఆమే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాబట్టి అటు దళపతికి ఇటు పూజాకు ఇద్దరికీ సంక్రాంతి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

Pooja Hegde to pair up with Vijay