* అధికారుల అలసత్వంతో ప్రజావాణీకి రాలేకపోతున్న జిల్లా ప్రజలు, రైతులు
* ఇప్పటికే పెండింగ్‌లో ఎన్నో సమస్యలు – ప్రజావాణీకి వెళ్లడమే సమయం వృధా అంటున్న బాధితులు
* మండల ప్రత్యేకాధికారులు చొరవ చూపి ప్రజాసమస్యల ను తీర్చాలని వేడుకుంటున్న జిల్లా ప్రజలు, రైతులు
* జిల్లాలో నీరుగారిపోతున్న ప్రజావాణీపై ప్రత్యేక కథనం.
జిల్లా ఏర్పాటుతో పరిపాలన మరింత చేరువైందని, ప్రజావాణీ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పూర్తిగా పరిష్కృతమవుతాయన్న ప్రజల్లో ఉన్న విశ్వాసం పూర్తిగా నీరుగారిపోయింది. అందుకు నిదర్శనం. జిల్లాలోని రేగోడ్ మండలంలో నిర్వహించిన ప్రజావాణీ కార్యక్రమానికి ప్రజల నుండి ఒక్క ఫి ర్యాదు కూడా రాకపోవడమే నిదర్శ నం. ప్రతి సోమవారం ప్రజావాణీ ద్వారా మారుమూల గ్రామాల్లో ఉన్న ఏ ఒక్కరికైనా ప్రభుత్వ పరంగా ఎలాం టి సమస్యలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్ఠికి తీసుకెళ్లేందుకు ప్రజావాణే ఏకైక మార్గంగా ఉండే ది. జిల్లా ఏర్పడిన మొదట్లో ప్రజావాణీ కార్యక్రమం కలెక్టరేట్ లో నిర్వహించినప్పుడు అప్పటి కలెక్టర్ భారతి హోళ్ళికేరికి ప్రజలు తమ సమస్యలను నేరుగా చెప్పుకొని పరిష్కృతమయ్యే విధంగా చూడాలని విన్నవించుకునే వారు. ప్రతి జిల్లాస్థాయి అధికారి ఖచ్చితంగా ప్రజావాణీ కార్యక్రమంలో హాజరుకావాలనే నియమనిబంధన కూడా ఉండేది. ప్రజల నుండి వచ్చే ఫి ర్యాదులను చూసి సంబంధిత అధికారులకు సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించేవారు. ప్రజావాణీ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుతో వస్తున్న ప్రజలు, రైతులతో కలెక్టరేటు కిక్కిరిసిపోయేది. బారులు బారులుగా వస్తున్న ప్రజల్లో మహిళల సం ఖ్య కూడా ఎక్కువే ఉండేది. దీంతో క్యూలైన్లు పాటించి తమ వి నతులను కలెక్టర్‌కు అందజేసి సమస్యను పరిష్కరించమని వేడుకునేవారు. అప్పటి కలెక్టర్ భారతిహోళ్ళికేరి ప్రజావాణీలో ప్రజలు పడుతున్న అవస్థలను గమనించి ప్రతి మండల కేం ద్రంలో ప్రజావాణీ కార్యక్రమం నిర్వహించాలని మండల ప్ర త్యేకాధికారులను ఆదేశించారు. మండల కేంద్రాలలో నిర్వహించబోయే ప్రజావాణీ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులందరు హాజరై మండలంలోని వివిధ గ్రామాల నుండి సమస్యలతో వస్తున్న ప్రజల యొక్క వినతులకు వెంటనే పరిష్కరించే విధంగా స్థానికంగా చర్యలు తీసుకోవాలని ప్రతి మండ ల కేంద్రంలో ప్రజావాణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్ప టి నుండి ప్రజావాణీ కార్యక్రమం కలెక్టరేట్ నుండి ప్రతి మండ ల కేంద్రంలో కొనసాగుతుంది. కలెక్టర్, జెసిలు ప్రతి సోమవారము ఏదో ఒక మండల కేంద్రంలో ప్రజావాణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజాసమస్యలను దగ్గరుండి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేవారు. ఈ తరుణంలో గత నెల 2వ తేదిన కలెక్టర్ బదిలీతో అధికారుల అలసత్వం పెరిగి ప్రజావాణీలో వచ్చే వినతుల పరిష్కారంలో నిర్లక్షం వహిస్తు ప్రజల్లో ప్రజావాణీపై ఆమాత్రం ఉన్న విశ్వాసాన్ని పూర్తిగా తుడిచివేస్తున్నా రు. సమస్యలు జిల్లాస్థాయి అధికారులకు మొదట్లో చెప్పుకున్నప్పటికీ రాను రాను అధికారుల నిర్లక్షంతో ప్రజాసమస్యలు అ పరిష్కృతంగానే మిగిలిపోయాయి. దీంతో అధికారులకు తమ వినతులు అందజేసి సమస్యలను పరష్కరించమని అడగడం కే వలం సమయం వృధా అనే భావన ప్రజల్లో నాటుకుపోయిం ది. అప్పడి నుండి ప్రజావాణీకి ప్రజాధరణ రాను రాను తగ్గుముఖం పట్టింది. ఇకనైనా అధికారులు కొండంత ఆశతో ప్రజావాణీకి వచ్చే ప్రజల వినతులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.