Home తాజా వార్తలు గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించండి: పోసాని

గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించండి: పోసాని

Posani Krishna Murali Press meet on GHMC Elections

హైదరాబాద్:  తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పోసాని కృష్ణమురళి అన్నారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు చాలా చాలా బాగున్నాయని పోసాని తెలిపారు. ఆయన శనివారం ప్రెస్ క్లబ్ లో మీడియా మాట్లాడుతూ… ”ఉద్యమ సమయంలో తెలంగాణ వాళ్లు నన్ను ఎప్పూడు ఒక్క మాట అనలేదు. తెలంగాణ వస్తే కరెంటు, నీళ్లుండవని ఆంధ్రా నాయకులు తప్పుగా మాట్లాడారు. 24గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. హైదరాబాద్ నగరంలో ఒక్కరోజు కూడా కరెంట్ సమస్య రాలేదు. తెలంగాణలో సాగు, తాగునీరు పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణను సిఎం కెసిఆర్ చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేరు. అందుకే జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి.” అని పోసాని ప్రజలను కోరారు.

”రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతోంది. సిఎం కెసిఆర్ పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంది. గతంలో హైదరాబాద్ లో మతకల్లోలాలు ఉండేవి. నగరంలో హిందూ,ముస్లింలు ఐక్యంగా కలిసుంటున్నారు. తెలంగాణ వచ్చాక ఆంధ్రాప్రజలపై ఎలాంటి దాడులు జరగలేదు. ఆంద్రావాళ్లని సిఎం కెసిఆర్ తెలంగాణ బిడ్లల్లాగానే చూస్తున్నారు. ఆంధ్రా నుంచి వచ్చినవాళ్లు కూడా తెలంగాణలో ఎంఎల్ఎలు అయ్యారు. తెలంగాణ కోసం తన ప్రాణం బలిపెట్టడానికి కెసిఆర్ సిద్ధపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో కెసిఆర్ నిర్మించారు. కరోనాకు వైద్యం ఎవరి దగ్గర లేదు. ప్రజల అలసత్వం వల్లేనే కరోనా పెరుగుతోంది. తెలంగాణలో చాలా బాగా అభివృద్ధి జరుగుతోంది. ఏ నాయకుడికైనా నిబద్దత, ఆదర్శం ఉండాలి.” అని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.

Posani Krishna Murali Press meet on GHMC Elections