Home తాజా వార్తలు 28 క్వింటాళ్ల అక్రమరేషన్ బియ్యం స్వాధీనం

28 క్వింటాళ్ల అక్రమరేషన్ బియ్యం స్వాధీనం

Ration Rice

 

వనపర్తి : వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రం శివారులో ఆదివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని డిసిఎస్‌ఒ, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసిఎస్‌ఒ రేవతి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఆత్మకూర్ మండల కేంద్రం శివారులో టిఎస్ 32 టి 1205 బొలేరో వాహనంలో 47 బస్తాలు, 28 క్వింటాళ్ల 70 కిలోల అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. డిసిఎస్‌ఒ, పోలీసులు విచారించగా బొలేరో వాహనం కేతిదొడ్డికి చెందిందని వీరేష్ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకొని బియ్యాన్ని సీజ్ చేశారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న బియ్యాన్ని సీజ్ చేసి రైచూర్ గోదాంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు వీరేష్, శ్రీనులపై కేసు నమోదు చేసి నట్లు డిసిఎస్‌ఒ రేవతి తెలిపారు. అక్రమ రేషన్ బియ్యాన్ని గోదాంకు తరలించినట్లు సివిల్ సప్లై అధికారులు తెలి పారు.

Possession of 28 quintals of illicit Ration Rice