Home తాజా వార్తలు మరో సారి బ్యాంకుల విలీనం

మరో సారి బ్యాంకుల విలీనం

Post 'Bad Bank' formation, merge 'bad' PSBs

విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు కలిపి ఒకే బ్యాంక్                                                                         పరిశీలిస్తున్న ప్రభుత్వం

బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు అవసరం : రాజీవ్ కుమార్
2015లోనే మొండి బకాయిలు వెలుగులోకి వచ్చాయి : జైట్లీ

న్యూఢిల్లీ : ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అనుబంధ బ్యాంకుల విలీనం తర్వాత మరో మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు విలీనానికి ప్రభుత్వం సిద్ధమైంది. విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు కలిపి ఒకే బ్యాంక్‌గా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. దీంతో దేశంలో మూడో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అవతరించనుందని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మూడు బ్యాంకుల బోర్డుల విలీనాన్ని పరిశీలిస్తున్నామని ఇక్కడ మీడియా సమావేశంలో కుమార్ తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు అవసరమని, బ్యాంకుల మూల

ధనం సంరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందని ఆయన అన్నారు. బ్యాం కింగ్ రంగంలో విదేశీ సేవల హేతుబద్ధీకరణ ఊపందుకుందని, మొండి బకాయిలు బ్యాంకింగ్ రంగానికి గుదిబండలా మారాయని, చరిత్రలో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రుణాల మంజూరులో కఠిన నిబంధనలు, ఒత్తిడి ఆస్తుల పరిష్కారం, ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) విషయంలో పారదర్శకంగా వ్యవహరించడం, ఎన్‌పిఎపై నష్టాలకు కేటాయింపులపై నిర్ణయాలతో పాటు క్లీన్ బ్యాంకింగ్ దిశగా ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. ఇంకా సంస్కరణకు ఎజెండా, ఎటి1 బాండ్ల రీకాలింగ్, విదేశీ బ్యాంక్ శాఖల హేతుబద్ధీకరణ, రూ.50 కోట్లకు పైగా రుణాలకు సంబంధించిన వివరాల సేకరణ చేపట్టనున్నామని కుమార్ తెలిపారు. విలీనం ప్రకటన అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, యుపిఎ ప్రభుత్వం హయాంలోనే అప్పులు పుట్టాయని, మొండి బకాయిల సమస్యను పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 2015లో మాత్రమే మొండి బకాయిల వాస్తవ విషయాలు వెలుగులోకి వచ్చాయని, యుపిఎ ప్రభుత్వం కంపెనీలకు రుణాలు ఇస్తూ పోయిందని అన్నారు. 2018 సంవత్సరంలో బ్యాంకుల స్థూల ఎన్‌పిఎ రూ.10.3 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో బ్యాంకుల ఏకీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జైట్లీ స్పష్టం చేశారు.