Home జాతీయ వార్తలు ‘శ్రీ రామ్ జన్మభూమి మందిరం’పై పోస్టల్‌ స్టాంప్‌ విడుదల

‘శ్రీ రామ్ జన్మభూమి మందిరం’పై పోస్టల్‌ స్టాంప్‌ విడుదల

Postal Stamp Release On Ram Temple By PM Modiలక్నో: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘శ్రీ రామ్ జన్మభూమి మందిరం‘పై స్మారక పోస్టల్‌ స్టాంప్‌ను ఆవిష్కరించారు. భారత పోస్టల్ డిపార్ట్ మెంట్ ఈ స్టాంప్ ను రూపొందించింది. రామాలయ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రజలు, ప్రముఖులు పూజలు చేశారు. రామనామ స్మరణతో దేశం మారుమోగిపోయింది. భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యుపి గవర్నర్ ఆనందీబెన్, సిఎం యోగి ఆదిత్యనాథ్ లతో పాటు 17 మంది ప్రముఖులు పాల్గొన్నారు.