Tuesday, September 17, 2024

‘రొమాంటిక్’గా వచ్చేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

Poster release from Romantic movie

 

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన చిత్రం ‘రొమాంటిక్’. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి పూరీ స్టోరీ,- స్క్రీన్ ప్లే,- డైలాగ్స్ అందించారు. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల గురించి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ‘రొమాంటిక్’ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లు వెల్లడించారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హీరోహీరోయిన్ల ఇంటెన్స్ రొమాంటిక్ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో ఆకాష్ పూరీ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. లావణ్య సమర్పణలో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, – ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News