Home తాజా వార్తలు పూడ్చిన శవానికి పోస్టుమార్టం

పూడ్చిన శవానికి పోస్టుమార్టం

postmortem

కొందుర్గు: పూడ్చిన ఓ వ్యక్తి శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చే సిన సంఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై తెలిపిన కథనం ప్రకారం…. కొందుర్గు జె ట్టి నాగర్జున (53) అనే వ్యక్తి ఈ నెల8 వ తేదీన దసరా పండుగ నాడు సాయంత్రం 5 గంటల సమయంలో పొలం దగ్గరికి వె ళ్లి మా పెద్ద మానషుల సమాదుల వద్ద జమ్మి పెట్టివస్తానని తన భార్య అయిన జెట్టి సత్యమ్మకు చెప్పి వెళ్లాడని, జమ్మి పెట్టాడానికి వెళ్లిన నాగర్జున రాత్రి 9 గంటలయినా రాకపోవడంతో అతనికి పోన్ కు పోన్ చేస్తే స్వీచ్ ఆప్ అని వస్తుందని భయదోళన గురై సత్యమ్మ తమ ఇంటి చూట్టు ప్రక్కల వాళ్లకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు అక్కడ వెళ్లి చూడగా నాగర్జున్ విగతజీవి పడి ఉన్నాడని వెంటనే ఆటో షాద్‌నగర్‌కు తరళించగా అప్పటికే నాగర్జున చనిపోయాడని ఆయన తెలిపారు.

ఆలస్యంగా నా భర్త చావు పై అనుమానాలు ఉన్నాయని కొందుర్గు పోలీసులకు భార్య ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు శనివారం మండల తహసీల్దార్ కృష్ణ రెడ్డి సమక్షం లో ప్రభుత్వ వైద్యాధికారులు శ్రీనివాస్ , సురేందర్ ఆధ్వర్యంలో పూడ్చిన శవం బయటికి వెలికితిసి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా కేసులు ఆధారణాలు సేకరించి నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు.

Postmortem for a Buried Corpse in Rangareddy