Home జాతీయ వార్తలు మహారాష్ట్ర రాజకీయం … విచారణ రేపటికి వాయిదా

మహారాష్ట్ర రాజకీయం … విచారణ రేపటికి వాయిదా

Supreme Courtఢిల్లీ : మహారాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంపై సుప్రీంకోర్టులో ఆదివారం విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం విచారణను రేపటికి (సోమవారం) వాయదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మెజార్టీ లేకుండా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ శివసేన, ఎన్ సిపి, కాంగ్రెస్ లు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. దీంతో ఈ పిటిషన్ పై ఆదివారం కోర్టులో విచారణ జరిగింది.  పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా లతో కూడిన ధర్మాసనం కేసు విచారణను సోమవారం నాటికి వాయిదా వేసింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు విచారణ చేస్తామని కోర్టు తేల్చి చెప్పింది. బిజెపిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ మహారాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో కోర్టు కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్, డిప్యూటీ సిఎం అజిత్ పవార్‌లకు నోటీసులు జారీ చేసింది. శివసేన, ఎన్ సిపి, కాంగ్రెస్ కూటమి కోరినట్టుగా బలపరీక్ష వెంటనే నిర్వహించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. గవర్నర్‌కు ఇచ్చిన ఎంఎల్ఎల మద్దతు లేఖ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 10.30 గంటల్లోగా ఎంఎల్ఎల మద్దతు లేఖను కోర్టుకు సమర్పించాలని , అనంతరం బిజెపి ప్రభుత్వ బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు వెల్లడించింది.

Postpone Trial On Maharashtra Politics In Supreme Court