Saturday, April 20, 2024

దసరా వరకు పరీక్షలన్నీ వాయిదా : మంత్రి సబిత

- Advertisement -
- Advertisement -

Postponed all Exams till Dussehra: Minister Sabitha Indra Reddy

 

మనతెలంగాణ/హైదరాబాద్ : దసరా పండగ ముగిసే వరకూ రాష్ట్రంలో నిర్వహించే అని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గత కొన్నిరోజులు కురుస్తున్న వర్షాలతో పాటు, కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి మున్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్‌కు పరీక్షల వాయిదా కోరుతూ విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వేయిదావేసే విషయాన్ని ఆలోచించాలని మంత్రి కెటిఆర్ విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తిచేశారు. దీంతో దసరా పండగ వరకూ అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు మంత్రి సబితారెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు. కాగా, జెఎన్‌టియుహెచ్,వాటి అనుబంధ కళాశాలలో బుధ,గురువారాలలో (అక్టోబర్ 21,22) జరగాల్సిన యుజి,పిజి రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నామని, ఇందుకు సంబంధించిన పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 27 నుంచి జరగాల్సిన పరీక్షల్లో ఎటువంటి మార్పు లేదని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News