Friday, March 29, 2024

ఎన్నికల ఫలితాల తర్వాత కథ

- Advertisement -
- Advertisement -

Powar star flim after elections

 

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు వర్మ. ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో త్వరలోనే ’పవర్ స్టార్’ సినిమా రిలీజ్ కానుందని.. ’జై పవర్ స్టార్’ అని ట్వీట్ చేశాడు. ఇక ‘పవర్ స్టార్’ టైటిల్ లోగో మధ్యలో పవన్ కళ్యాణ్ స్థాపించిన ’జనసేన’ పార్టీ ఎలక్షన్ సింబల్ అయిన ‘గ్లాస్’ని పెట్టాడు. అంతేకాకుండా ఇది ‘ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ అని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని పోలి ఉన్న ఆర్టిస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. “పవర్‌స్టార్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న యాక్టర్ నేను చూసిన స్టార్స్ అందరి కంటే ఎక్కువ పవర్‌ఫుల్‌” అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం ప్రధాన పాత్రదారులతో తీసిన ఫోటో షూట్ చిత్రాలను కూడా పవన్‌కళ్యాణ్ పంచుకున్నాడు. అంతేకాకుండా ఈ ఫొటోల్లో ఏవైనా పోలికలు ఉంటే అది యాదృచ్చికం మాత్రమే… అని పవన్ పేర్కొన్నాడు. దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు వర్మపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News