Home తాజా వార్తలు యాదాద్రి ప్రధానాలయానికి విద్యుత్ కాంతుల వెలుగులు

యాదాద్రి ప్రధానాలయానికి విద్యుత్ కాంతుల వెలుగులు

Power lights electrification trail run in yadadri temple

 

రేపు సాయంత్రం విద్యుత్ దీపాలంకరణ డెమో ప్రదర్శన

యాదాద్రి : తెలంగాణ ప్రసిధ్ధ క్షేత్రముగా ప్రపంచ ఖ్యాతి పొందేలా యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులు ముఖ్యమంత్రి కేసిఆర్ సంకల్పంతో కొనసాగుతున్న తరుణంలో ప్రధానాలయ నిర్మాణ పనులు పూర్తి చేసి తుది మెరుగులు పనులవుతున్న సమయంలో ఆలయానికి విద్యుత్ దీపాల అలంకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రధానాలయ గర్భాలాయం, ఆలయ మాడవీధులు, ప్రకారంలో విద్యుత్ దీపాల ఏర్పాటు పనులు సాగుతున్నాయి.

రెండు రోజులుగా ఆలయానికి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను వెలిగిస్తూ అధికారులు విద్యుత్ కాంతులను పరిశీలన చేశారు. పూర్తిగ శిల సంపదతో ఆధ్యాత్మిక సంస్కృతి తెలియ పరిచేలా రూపొందిన ఆలయ నిర్మాణంకు ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతుల్లో పసిడి వెన్నెలగా ఆలయ కాంతులు కనబడుతున్నాయి. స్వామి వారి దర్శనార్ధం భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రధాన క్యూలైన్లు పూర్తి కావడంతో తుది మెరుగులతో ప్రధానాలయ పనులు పూర్తి చేయడానికి పనులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

విద్యుత్ దీపాలంకరణకు డెమో ప్రదర్శన..
యాదాద్రి ఆలయానికి గత కొద్ది రోజులుగా విద్యుత్ దీపాలంకరణ పనులు చేపట్టి పూర్తి కావొస్తున్న తరుణంలో కొన్ని రోజులుగా నమూనగా విద్యుత్ దీపాలను వెలింగించి చూసిన వైటిడిఏ, ఆలయ అధికారులు నేడు సాయంత్రం విద్యుత్ దీపాల అలంకరణకు డెమో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గీత ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రధానాలయానికి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణకు పరిశీలన చేయడం కోసం డెమో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Power lights electrification trail run in yadadri temple