Home తాజా వార్తలు ‘ మా మధ్య ప్రేమ లేదు…మొర్రో…’

‘ మా మధ్య ప్రేమ లేదు…మొర్రో…’

Prabhas - Anushkaహైదరాబాద్ : తమ మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారం లేదని హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు తేల్చిచెప్పుతున్నప్పటికీ వారిపై పుకార్లు మాత్రం ఆగడం లేదు. ప్రభాస్, అనుష్కలు ప్రేమలో మునిగి తేలుతున్నారని, త్వరలోనే వారు పెళ్లి చేసుకోబోతున్నారన్ని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇదిలో ఉండగా వీరిపై ఇప్పుడు మరో పుకారు బయల్దేరింది. వీరు అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఇంటి కోసం వెతుకుతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభాస్ స్పందించారు. అనుష్క, తనకు మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారం లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజలు తాను చెప్పేదాన్ని నమ్మకపోతే, తాను చేసేదేమీ లేదని ఆయన పేర్కొన్నారు. అనుష్క తనకు కొన్నేళ్లుగా తెలుసునని, తమ మధ్య స్నేహమే తప్ప ప్రేమ లేదని ఆయన స్పష్టం చేశారు. తాను, అనుష్క కలిసి ప్రజలకు ఎప్పుడైనా కనిపించామా అని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి పుకార్లు ఎలా వస్తాయో తనకు అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను ప్రేమ పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉందని ఇటీవల ప్రభాస్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతోనే ఆయన అనుష్కతో ప్రేమలో ఉన్నారని అభిమానులు అపోహ పడుతున్నారు. అయితే ఈ విషయంపై ప్రభాస్ స్పందించినప్పటికీ, అనుష్క మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

Prabhas – Anushka Hunting For House In America