Saturday, December 2, 2023

మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో…

- Advertisement -
- Advertisement -

Prabhas movie in wake of Third World War

 

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, దర్శకుడు- రాధాకృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే ప్రభాస్ తన కెరీర్‌లో 21వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీ దత్ నిర్మిస్తుండగా ఆయన అల్లుడు నాగ్‌అశ్విన్ దర్శకత్వం వహించనున్నాడు. నాగ్‌అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలతో పాటు అవార్డులను కూడా పొందాడు. దీంతో ప్రభాస్ చిత్రాన్ని కూడా ఈ యంగ్ డైరెక్టర్ అదే స్థాయిలో అద్భుతంగా తెరకెక్కిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే గత రికార్డులను తిరగరాసేలా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటిదాకా పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారతాడని అంటున్నారు. దేశ, విదేశాల్లో ఈ స్టార్ హీరోకి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

పాన్ ఇంటర్నేషనల్ సినిమా కావడంతో వివిధ సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ యాక్టర్స్‌ను తీసుకోనున్నారట. అలాగే వివిధ టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్‌కి సంబంధించి హాలీవుడ్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పని చేయబోతున్నారట. ఈ సినిమా జోనర్ ఏమిటనేది ఫిల్మ్‌మేకర్స్ వెల్లడించనప్పటికీ ఇది ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అని వార్తలు వస్తున్నాయి. ఇదిలాఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. ఈ మూవీ మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఉండబోతోందట. థర్డ్ వరల్డ్ వార్ మెయిన్ పాయింట్‌గా ఉండబోతున్న ఈ సినిమా కోసం ఓ భారీ సెట్‌ను కూడా హైదరాబాద్‌లోనే వేయబోతున్నారని తెలిసింది. అందుకోసమే ఈ సినిమాకు దాదాపు 400 కోట్ల మేరకు బడ్జెట్‌ను నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నాయని తెలిసింది. వైవిధ్యమైన అంశాలతో కూడిన స్టోరీ కాబట్టే ప్రభాస్ సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశాడని అంటున్నారు. అంతేకాకుండా వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లి 2022 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News