Thursday, April 25, 2024

విక్రమాదిత్య ఎవరు?

- Advertisement -
- Advertisement -

Prabhas poster released from Radheshyam

 

చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ మళ్లీ రొమాంటిక్ జోనర్‌లో సినిమా చేస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత ‘రాధే శ్యామ్’ సినిమాలో విక్రమాదిత్య అనే రొమాంటిక్ పాత్రలో నటిస్తున్నారు ప్రభాస్. ఈ మధ్య హీరోయిన్ పూజా హెగ్డే పుట్టిన రోజున ఆమె స్పెషల్ బర్త్ డే పోస్టర్ విడుదల చేశారు. ఇప్పుడు ప్రభాస్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 23న టీజర్ విడుదల చేయబోతున్నారు. విక్రమాదిత్య అంటే ఎవరు… అంటూ పోస్టర్‌పై రాసుకొచ్చారు. టీజర్‌లో దీనికి సమాధానం చెప్పబోతున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో బాగా ఆలోచిస్తున్నట్లు కనిపించారు ప్రభాస్.

ఈ ఫోటోలో ప్రభాస్ లుక్స్ చాలా షార్ప్‌గా ఉన్నాయి. మొత్తంగా ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా అనిపిస్తుంది. ఇక ఈనెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విక్రమాదిత్య క్యారెక్టర్ టీజర్ విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. ఈ టీజర్‌లో డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్‌లో ఉండబోతున్నాయి. భిన్నమైన భాషల్లో సబ్ టైటిల్స్ కనిపిస్తాయి. జనవరి 14, 2022న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు పాన్ ఇండియన్ స్థాయిలో రాధే శ్యామ్ విడుదల కానుంది. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డాక్టర్ యువి కృష్ణంరాజు సమర్పిస్తున్నారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News