Home తాజా వార్తలు ఇంటెన్స్‌గా, ఆసక్తికరంగా…

ఇంటెన్స్‌గా, ఆసక్తికరంగా…

Prabhas praises maha samudram trailer

 

‘ఆర్‌ఎక్స్100’ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా వచ్చిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్‌పై స్పందించారు. ‘మహాసముద్రం’ ట్రైలర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రభాస్.. ఇది ఇంటెన్స్‌గా, ఆసక్తికరంగా ఉందని పేర్కొన్నారు. శర్వానంద్,- సిద్దార్థ్ లతో పాటుగా చిత్ర యూనిట్ మొత్తానికి యంగ్ రెబల్ స్టార్ విషెస్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో అదితిరావు హైదరి, – అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

Prabhas praises maha samudram trailer