Home సినిమా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ‘సాహో’

స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ‘సాహో’

Prabhas Sahoo Movie Release Date Fixed 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో మూడు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్‌గా భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఒకేసారి మూడు భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ట్రైలింగ్వల్ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘షాడో ఆఫ్ సాహో’కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫస్ట్‌లుక్‌ను కూడా బర్త్‌డే రోజున రిలీజ్ చేశారు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్‌లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘సాహో’ను ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్‌తో పాటు హాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారు.

బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ లిరిక్స్‌ను అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ప్రేక్షకులు, అభిమానుల అంచనాలను అందుకునేలా ‘సాహో’లో ప్రభాస్ స్టైలిష్‌గా ఓ కొత్త ఎనర్జీతో కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వంశీ, ప్రమోద్ మాట్లాడుతూ “ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మా బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రం ‘సాహో’. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన స్పందన రావడంతో చాలా హ్యాపీగా ఉంది. ప్రభాస్ స్టైలిష్ పర్‌ఫార్మెన్స్, సుజిత్ వరల్డ్‌క్లాస్ విజన్, శ్రద్ధాకపూర్ అందచందాలు, బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ టాప్ క్లాస్ మ్యూజిక్, మధి గ్రాండియర్ విజువల్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి”అని అన్నారు.

Prabhas Sahoo Movie Release Date Fixed