Home తాజా వార్తలు ‘సాహో’ రొమాన్స్…

‘సాహో’ రొమాన్స్…

Saaho new poster

 

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ‘సాహో’. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో భారీ విడుదల చేయనున్నారు.ప్రస్తుతం రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా అన్ని లాంగ్వేజ్ లల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. మధ్యమధ్యలో మూవీ పోస్టర్స్ విడుదల చేస్తూ అభిమానులను కనువిందు చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ లో సాహో న్యూ పోస్టర్ ను షేర్ చేశాడు. ‘యాక్షన్, రొమాన్స్..  మరెన్నో! అగస్టు 30న సాహో కోసం సిద్ధంగా ఉండండి!’ అని పేర్కొన్నాడు.

ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఒళ్లో శ్రద్ధా కపూర్ కూర్చొని గట్టిగా హత్తుకుంది. చేతిలో గన్‌ పట్టుకుని రొమాంటిక్‌గా చూస్తోంది. ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ను, 2016లో బాలీవుడ్ లో రన్ బీర్ కపూర్, ఐశ్వర్య రాయ్ కలిసి నటించి సినిమాలోని రోమాన్స్ స్టిల్ తో పోలుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున తరలిరావడం వేదిక కిక్కిరిసిపోయింది.

 

Prabhas shares Saaho Romance poster