Thursday, April 25, 2024

కామెడీ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

Prabhu deva act in charle champlin

 

ప్రభుదేవా, అదాశర్మ, నిక్కి గల్రాని హీరోహీరోయిన్లుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో వచ్చిన తమిళ్ మూవీ ‘చార్లీ చాప్లిన్’ను తెలుగులో ‘మిస్టర్ ప్రేమికుడు’తో అనువదించారు. శ్రీ తారకరామ పిక్చర్స్ పతాకంపై ఎం.వి.కృష్ణ సమర్పణలో వి.శ్రీనివాసరావు, గుర్రం మహేష్ చౌదరి ఈ చిత్రాన్ని ఈనెల 29న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత గుర్రం మహేష్ చౌదరి మా ట్లాడుతూ “ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెలుగు స్ట్రయిట్ సినిమాలా డబ్బింగ్ చేయించాము. తమిళ్‌లో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా అదే స్థాయిలో ఆడుతుందన్న నమ్మకం ఉంది”అని అన్నారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ “ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని పాటలు, సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ప్రభుదేవా పర్‌ఫార్మెన్స్, డాన్స్, అదాశర్మ, నిక్కిగల్రాని అందం, అభినయం సినిమాలో ఆకట్టుకుంటాయి”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, ముత్యాల రాందాస్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News