Home తాజా వార్తలు రెండో వివాహం చేసుకున్న ప్రభుదేవా

రెండో వివాహం చేసుకున్న ప్రభుదేవా

Prabhudheva got second marriage

 

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శక నిర్మాత, నటుడు ప్రభుదేవా రెండో వివాహం ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్. కొన్ని వారాలుగా ఆయన వివాహంపై నెటిజన్లలో ఆసక్తికర చర్చ సాగుతోంది. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తొమ్మిది సంవత్సరాల తరువాత ప్రభుదేవా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తొలుత ఆయన తన మేనకోడలినే పెళ్లాడారని ప్రచారం సాగింది. కానీ తనకు సేవలు చేసిన ఓ ఫిజియో థెరపిస్టును ప్రభుదేవా పెళ్లాడడం విశేషం. ఇటీవల గుట్టు చప్పుడు కాకుండా ఫిజియోథెరపిస్ట్ కమ్ డాక్టర్ హిమనిని ఆయన వివాహం చేసుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఇద్దరూ చెన్నైలో వివాహం చేసుకున్నారు.

తాజాగా ప్రభుదేవా సోదరుడు రాజు సుందరం ఈ పెళ్లిని అధికారికంగా ధృవీకరించారు. ఇక కొన్ని నెలల క్రితం వెన్నునొప్పితో బాధపడుతున్న ప్రభుదేవాకు హిమని చికిత్స చేసింది. ఆతర్వాత కొంతకాలం ఇద్దరూ డేటింగ్ చేశారు. ప్రస్తుతం ప్రభుదేవా, హిమని చెన్నైలో కలిసి నివసిస్తున్నారు. ఇక ప్రభుదేవా మొదటి వివాహం 1995లో రామలతతో జరిగింది. అనంతరం సహనటి నయనతారను ప్రేమించి పెళ్లాడేందుకు ప్రభుదేవా సిద్ధమైనా రకరకాల కారణాలతో అది వీలు పడని సంగతి తెలిసిందే. 47 ఏళ్ల ప్రభుదేవా తన మొదటి భార్య నుండి అధికారికంగా 2011లో విడిపోయారు.