Home తాజా వార్తలు జల మండలికి జాతీయ స్థాయిలో ప్రశంసలు

జల మండలికి జాతీయ స్థాయిలో ప్రశంసలు

 Water Board

 

హైదరాబాద్ : మహానగరంలో జలమండలి చేపట్టే పలు కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో భాగంగా న్యూఢిల్లీలో సోమవారం కేంద్ర హౌసింగ్, అర్భన్ ఎఫైర్ మంత్రిత్వశాఖ, సోషల్ జస్టిస్, ఎంపవర్‌మెంట్ శాఖల ఆధ్వర్యంలో స్దిరమైన పారిశుద్ద్యం అనే అంశంపై జాతీయ సెమినార్ నిర్వహించారు. దేశంలోని వివిధ వాటర్‌బోర్డు ప్రతినిధులు పాల్గొనగా అందులో జలమండలి పారిశుద్ద్య నిర్వహణ, ఎస్టీపీల ద్వారా మురుగునీరు శుద్ది, రెయిన్‌వాటర్, హర్వేసింగ్ పార్కు, వాక్ కార్యక్రమాలపై ఈసదస్సులో మూడు స్టాళ్లును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జలమండలి ఎండి దానకిషోర్‌తో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈకార్యక్రమాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతశాఖ మంత్రి హార్వీందర్‌సింగ్ ప్రారంభించగా, గృహ,పట్టణాభివృద్దిశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ ముఫ్రా అధ్యక్షత వహించారు. ఈసెమినార్ లో పాల్గొన్న జలమండలి ఎండి దానకిషోర్ మాట్లాడుతూ.. పారిశుద్ద్యంలో జలమండలి తీసుకువచ్చిన సంస్కరణలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వర్క్‌షాపులో వివరించారు. వాటి పనితీరు రూపొందించాల్సిన అవసరం వంటి విషయాలను పేర్కొన్నారు. మురుగునీరు నిర్వహణలో కార్మికులకు శిక్షణ వంటి విషయాలను తెలియజేశారు. నగరంలో వృథాగాపోతున్న నీటిని అరికట్టేందుకు వాక్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. స్వయంసహాయక బృందాలు, స్టాప్‌వేర్ ఇంజనీర్లతో పాటు మొత్తం 6300మంది వాలంటీర్లు నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.

అనంతరం హౌసింగ్ అండ్ అర్భన్ అపైర్స్ కార్యదర్శి దుర్గాశంకర్ ముఫ్రా ప్రసంగిస్తూ హైదరాబాద్ నగరంలో జలమండలి ఎండి దానకిషోర్ పనితీరు, ప్రవేశపెట్టే పథకాలు ఎంతో అద్భుతమని ప్రశంసించారు. ఇప్పటికే ఉన్న థీమ్ పార్కులకు తోడు అదనంగా ఐదు పార్కులు నిర్మించడం పట్ల అభినందించారు. అలాగే ఓడిఎప్ ప్లస్, ఘన వ్యర్దాల నిర్వహణ, వ్యర్ద నీటి నిర్వహణ వంటి విషయాల్లో హైదారాబాద్ మహానగరాలకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. ఘన వ్యర్దాలతో పాటు ఇప్పటికే ఉన్న ఎస్టీపిల మల వ్యర్దాల శుద్ది నిర్వహణపై ఈడీ ఎం. సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈసెమినార్‌లో ఆపరేషన్1 డైరెక్టర్ ఆజ్మీరా కృష్ణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Praise to Water Board at National level