Home కరీంనగర్ ప్రజావాణి సమస్యలకు సత్వరమే పరిష్కారం

ప్రజావాణి సమస్యలకు సత్వరమే పరిష్కారం

collcter-nethu-pradasజిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశం

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల సమస్యలపై స్పందించి అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియం మరమ్మతుల కారణంగా కలెక్టర్ తన ఛాంబర్‌లోనే ఫిర్యాదులను స్వీకరించారు. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్షం కారణం చేతనే జిల్లా కేంద్రానికి వచ్చి పలుమార్లు ఫిర్యాదులు చేయాల్సి వస్తుందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశా రు. కలెక్టరమ్మ చొరవ తీసుకొని అధికారుల పనితీరులో మార్పు తెచ్చినట్టయితే గ్రామ, మండలస్థాయిలోనే తమ సమస్యలు పరిష్కరిం చబడు తాయని గోడు వెల్లబోసుకున్నారు .
– మన తెలంగాణ/కలెక్టరేట్