Home తాజా వార్తలు మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు..

మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు..

Prakash Raj complaint against Manchu Vishnu Panel

హైదరాబాద్: మా ఎన్నికల పోరు మాటల యుద్ధంతో రోజురోజుకు ముదురుతుంది. తాజాగా మంచు విష్ణు ప్యానల్ పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు ప్యానల్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తోందని శ్రీకాంత్, జీవితతో కలిసి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ” ‘మా’లో సోషల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోంది.  60ఏళ్లు పైబడిన నటులే పోస్టల్ బ్యాలెట్ కు అర్షులు. నిన్న సాయంత్రం ఒక వ్యక్తి 56మందికి డబ్బులు ఇచ్చారు. 60మందితో పోస్టల్ బ్యాలెట్ తో తనకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నాడు.  వివిధ నగరాల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ లు అన్నీ ఒకేలా ఎల ఉంటాయి. ఏజెంట్ల ద్వారా పోస్టల్ ఎన్నికల కుంట్ర చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చిరంజీవి, మురళీ మోహన్, నాగార్జున స్పందించాలి” అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

Prakash Raj complaint against Manchu Vishnu Panel