Home జాతీయ వార్తలు 5 ట్రిలియన్ డాలర్ల ఫలం ఆకాశం నుంచి ఊడిపడదే

5 ట్రిలియన్ డాలర్ల ఫలం ఆకాశం నుంచి ఊడిపడదే

Pranab Mukherjee

 

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ స్పందన..
కాంగ్రెస్ సర్కార్లు ఏం చేయలేదనడంపై ఖండన
ప్రణాళికయుత ప్రగతిని కాదనడంపై విసుర్లు

న్యూఢిల్లీ : సంకల్పిత 5 లక్షల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అనేది అమాంతం ఆకాశం నుంచి ఊడిపడదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమి చేయలేదనే బిజెపి ప్రభుత్వ ధోరణిపై ఆయన పరోక్షంగా విమర్శలు కురిపించారు. ప్రణాళికా సంఘం రద్దును తప్పుపట్టారు. ఇక్కడ ఒక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థపై ఆయన అత్యంత అసాధారణ వ్యాఖ్యలకు దిగారు. ప్రస్తుత ప్రభుత్వం భారీ స్థాయిలో ఐదు లక్షల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్షంగా పెట్టుకుంది. ఇది మంచిదే. అయితే ఇది ఉన్నట్లుండి వెలుగులోకి రాదని, ఈ స్థాయి జిడిపి లక్ష సాధన గత ప్రభుత్వాల పనితీరుతోనే సాధ్యం అవుతుందని అనుకోవల్సి ఉంటుందని, ఇందుకు అప్పటి ప్రభుత్వాలను అభినందించాల్సి ఉంటుందన్నారు.

పలుసార్లు ఆర్థిక మంత్రిగా, బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత వహించిన ప్రణబ్ ఈ కీలక ప్రసంగంలో పలు ఆర్థిక అంశాలను స్పృశ్శించారు. సమృద్ధ భారత్ ఫౌండేషన్ వారు ఈ కీలకోపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటీవలి బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఆర్థిక మంత్రి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు అవుతుందని చెప్పారు. సరైన గత ప్రాతిపదికతోనే ఇది సాధ్యం అవుతుంది. ఇదేదో బ్రిటిష్ పాలకులు రూపొందించిన ఆర్థిక వ్యవస్థ కాదని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత మనం నిర్మించుకున్నదని స్పష్టం చేశారు. సాధారణంగా నియంత్రిత వ్యాఖ్యానాలకు దిగే ప్రణబ్ ఈ సందర్బంగా తీవ్రస్థాయిలోనే స్పందించారు. 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై విమర్శలకు దిగే వారు, ఏం సాధించారని ప్రశ్నించేవారు ఒక్కటి గుర్తుంచుకోవాలి.

స్వాతంత్య్రం వచ్చిన దశలో దేశం ఏ స్థాయిలో ఉందనేది మరిచిపోరాదు. ఇప్పుడు ఏ దశకు చేరామనేది గ్రహించాలి. ఈ ప్రక్రియలో ఇతరుల తోడ్పాటు కూడా ఉంది. అయితే నవ భారతానికి పునాదులు వేసింది మన దేశ వ్యవస్థాపకులే. వారు ప్రణాళికయుతైన ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం ఉంచారు. అందుకు అనుగుణంగా తీర్చిదిద్దారు. అయితే ప్రణాళికా సంఘాన్ని ఇందుకు విరుద్ధంగా రద్దు చేశారు. మరి ఏం జరుగుతోంది’ అని ప్రణబ్ సందేహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ అధికారంలోకి రాగానే పంచవర్ష ప్రణాళికలకు వ్యూహాలకు దిగే , సరైన నిర్ణీత అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారు. దీని స్థానంలో ప్రభుత్వ ఆలోచనల వేదికగా నీతి ఆయోగ్‌ను తీసుకువచ్చారు. గత ప్రభుత్వాలపై విమర్శలకు దిగే వారు అన్నింటి కంటే ఒక్క కీలకమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, దీనిని అంకెలపరంగానే తాను చెపుతున్నానని ప్రణబ్ తమ వివరణకు దిగారు.

స్వాతంత్య్రం వచ్చిన దశలో ఆర్థిక పరిస్థితి దాదాపుగా జీరోగా నిండుసున్నాగా ఉంది. పలు క్లిష్టతలను ఎదుర్కొని ప్రస్తుతం 1.8 ట్రిలియన్ డాలర్ల పటిష్ట పునాది స్థాయికి చేరింది. ఇదే ఇక ముందు నిర్ణయించుకున్న 5 లక్షల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ప్రాతిపదిక అవుతుందని, గత సాధన లేకుండా ఇక ముందటి లక్ష సాధన కుదురుతుందా? అని ప్రశ్నించారు. ఈ ఘనతకు పునాదులు నెహ్రూ, పివి, మన్‌లవే 8 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు సరైన పునాదులు వేసిన వారిని విస్మరించడం తగదని, నెహ్రూ, పివి, మన్మోహన్ సింగ్ వంటి వారి నాయకత్వంలోని గత ప్రభుత్వాల హయాంలో దీనికి ప్రాతిపదిక ఏర్పడిందని, దీనిని ఎవరూ విస్మరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

Pranab Mukherjee talks about 5 trillion dollar agenda