Home జాతీయ వార్తలు అంధత్వం జయించి.. సబ్ కలెక్టర్ గా నిలిచి…

అంధత్వం జయించి.. సబ్ కలెక్టర్ గా నిలిచి…

Pranjal patil

 

ముంబై : ఆరేళ్ల వయసులో కంటిచూపు కోల్పోయినా.. ఆత్మ విశ్వాసం కోల్పోకుండ ధృఢ సంకల్పంతో తన సివిల్స్ కలను నెరవేర్చుకుంది. మహారాష్ట్ర ఉల్హాస్ నగర్ కు చెందిన ప్రంజల్ పాటిల్ కంటిచూపు లేకున్నా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రంజల్ పాటిల్ తిరువనంతపురం సబ్ కలెక్టర్ గా సోమవారం జిల్లా కలెక్టర్ కే గోపాలకృష్ణన్, కలెక్టరేట్ సిబ్బంది సమక్షంలో సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. దేశంలోనే తొలి అంధ ఐఏఎస్ అధికారిణిగా ప్రంజల్ పాటిల్ రికార్డుల్లోకెక్కారు. 2017 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో ప్రంజల్ పాటిల్ 124వ ర్యాంకు సాధించారు. ఆ తర్వాత 2018లో ఆమె ఎర్నాకులమ్ అసిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.

Pranjal patil who Blind woman as Sub Collector