Friday, March 29, 2024

‘సలార్’ అంటే అర్థమది

- Advertisement -
- Advertisement -

Prashanth Neil clarifies the meaning of Salar

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘సలార్’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రశాంత్ నీల్… అకస్మాత్తుగా ప్రభాస్‌తో సినిమా ప్రకటించి అందరినీ ఆశ్యర్యానికి గురి చేశాడు. ‘సలార్’ పోస్టర్‌లో ప్రభాస్ వయోలెంట్ లుక్‌ని చూసిన సినీ అభిమానులు షాక్ తిన్నారు. అలాగే అందరూ ‘సలార్’ అంటే అర్థం ఏమిటని గూగుల్‌లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ‘సలార్’ టైటిల్ అర్థం, ప్రభాస్ తో సినిమా చేయడానికి గల కారణాలను వెల్లడించాడు.

ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ “కన్నడ హీరోలతో కాకుండా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రభాస్ తో సినిమా చేయడం గురించి అందరూ అడుగుతున్నారు. నేను రాసుకున్న ‘సలార్’ కథకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని నాకు అనిపించింది. అందుకే ఆయనతో ఈ సినిమా చేస్తున్నా. ఇందులో ప్రభాస్ క్యారక్టర్ వయోలెంట్‌గా ఉంటుంది. ఇక ‘సలార్’ టైటిల్‌కు ఎన్నో రకాల అర్థాలు చెబుతున్నారు. ఇది ఉర్దూ భాషలోని ఒక సామాన్యమైన పదం. ‘సలార్’ అంటే సమర్థవంతమైన నాయకుడు.. రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజలను రక్షించే వ్యక్తి అని చెప్పొచ్చు. ఓ వయోలెంట్ పాత్రను మీ ముందుకు తీసుకురానున్నాను. దీనికి తగ్గట్టే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాం. ప్రభాస్ లుక్ చూసి ఆర్మీలో ఉండే వ్యక్తి అని అందరూ అనుకుంటారనే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టైటిల్ తో పాటు విడుదల చేశాం” అని తెలియజేశాడు.

Prashanth Neil clarifies the meaning of Salar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News