Home తాజా వార్తలు ‘జాంబీ రెడ్డి’ ప్రోమో విడుదల

‘జాంబీ రెడ్డి’ ప్రోమో విడుదల

Prashanth Varma Movie Zombie Reddy Promo Releaseహైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ’జాంబిరెడ్డి‘ ప్రోమో‘ను శనివారం విడుదల చేశారు. తన తొలి సినిమా ’అ!’తో ప్రశాంత్ వర్మ విజయం అందుకున్నారు. అనంతరం రాజశేఖర్ హీరోగా ఆయన ’కల్కి‘ తెరెకెక్కించారు. ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. ఇప్పడు ప్రశాంత్ వర్మ ’జాంబిరెడ్డి‘ సినిమాను రూపొందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను తీస్తున్నారు. తన మూడో సినిమాకు ’జాంబిరెడ్డి‘ అనే టైటిల్ ను ప్రకటిస్తూ, ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను ఆయన విడుదల చేశారు. ఈ సినిమాను  యాపిల్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ నిర్మిస్తున్నారు. మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.