తిరువనంతపురం: గర్భంతో ఉన్న పిల్లిని తాడుతో ఉరేసిన సంఘటన కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని పల్కులంగారా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. షెడ్ పక్కన గల ఓ పిల్లర్‌కు వేలాడుతున్న పిల్లిని స్థానికులు గమనించి వంచియూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జంతు హింస కింద కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారు. స్థానికులు జంతు సంరక్షణ అధికారులు సమాచారం ఇవ్వడంతో ఆ పిల్లి కళేబరాన్ని దహనం చేయకుండా వాళ్లు ఆపారు. షెడ్ యజమాని తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ పేకాట ఆడుతున్నారని స్థానికులు తెలిపారు. జంతు ప్రేమికురాలు పార్వతి మీడియాతో మాట్లాడారు. మద్యం మత్తులో సరదా కోసం పిల్లిని తాడుతో ఉరేసి వాళ్లు పైశాచికానందం పొందారని, ఆ తరువాత పిల్లి కళేబరాన్ని దహనం చేయాలనుకున్నారని తెలిపారు. సరదా కోసం జంతువులను హింసించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పిల్ల కళేబరాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.
Pregnant Cat Hanged to Death by Local in Kerala