Home జోగులాంబ గద్వాల్ కాన్పు కోసం వెళ్లితే కానరాని లోకాలకు..

కాన్పు కోసం వెళ్లితే కానరాని లోకాలకు..

Pregnant woman died due to negligence of doctors

 

గద్వాల: కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ గర్బిణికి సకాలంలో వైద్యం అందక పోవడంతో మృతి చెందింది. ఈ ఘటన గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. గర్భిణి పురిటి నొప్పులప్పుడు వైద్యం అందకపోవడంతో సదరు మహిళ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ సంఘటనకు సంబందించి వివరాలిలా ఉన్నాయి. వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన స్టీపెన్‌తో మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామానికి చెందిన శృతి(21) అనే మహిళతో ఏడాది కింద వివాహం జరిగింది. నిండు గర్భిణి అయిన శృతికి ఇటీవల పురిటినొప్పులు రావడంతో ఈనెల 17న గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వైద్య పరీక్షలు చేసినంనతరం అప్పుడు ఇప్పుడు… కాన్పు చేస్తామంటూ ఆలస్యం చేయడంతో గురువారం తెల్లవారుజామున ఆమెకు పురిటినొప్పులు రాగ గమనించిన కుటుంబసభ్యులు వైద్య సిబ్బందికి తెలియజేశారు.

అయితే ఆమెకు హైబీపీ రావడంతో వాంతులు చేసుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో వైద్య సిబ్బంది తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిలే చూడటమే కాదు నిర్లక్షంగా వ్యవహరించి ప్రాణాలను బలితీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న గద్వాల సీఐ షేక్ మహబూబ్ బాష ఆధ్వర్యంలో గద్వాల టౌన్ ఎస్‌ఐ రమాదేవి, రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, మల్దకల్ ఎస్‌ఐ ఆర్.శేఖర్‌లు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గర్బిణీ మృతికి గల కారణాలు వైద్యులను, కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణి మృతిపై జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్ కుమార్‌ను వివరణ కోరగా గర్బిణి మహిళకు మొదటి నుంచి బీపీ పెరుగుతుండటంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి వైధ్యుల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేసి బీపీ తగ్గించడానికి ట్రీట్‌మెంట్ చేసినట్లు వెల్లడించారు. గురువారం గర్భిణీకి హైబీపీతో పాటు వాంతులు ఎక్కువ కావడంతో మృతి చెందినట్లు తెలిపారు.

Pregnant woman died due to negligence of doctors in gadwal