Wednesday, November 30, 2022

వైద్యుల నిర్లక్ష్యం : గర్భిణి మృతి

- Advertisement -

Pregnant Woman Died With Doctors Negligenceజోగులాంబ గద్వాల : ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం‌ వచ్చిన ఓ గర్భిణి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.  వడ్డేపల్లి మండల పరిధిలోని తనగల గ్రామానికి చెందిన శృతి (21) ప్రసవం  కోసం ఈనెల 17న గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. గురువారం ఉదయం శృతికి హైబీపీ వచ్చింది. దీంతో ఆమెను వైద్యులు పరీక్షించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య శృతి చనిపోయిందని ఆమె భర్త స్టీపెన్ ఆరోపిస్తున్నారు. బుధవారం రాత్రి శృతికి పురిటి నొప్పులు వచ్చాయని, వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లనే తన భార్య శృతి చనిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య శృతి మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శృతి మృతిపై సమాచారం అందుకున్న గద్వాల సిఐ షేక్ మహబూబ్ పాషా గద్వాల ఆసుపత్రికి వచ్చి విచారణ చేపట్టారు.

Related Articles

- Advertisement -

Latest Articles