Thursday, April 25, 2024

8 నెలల గర్భిణి 200 కిలో మీటర్లు ప్రయాణించి….

- Advertisement -
- Advertisement -

photo courtesy by Social Media

కాన్పూర్: ఎనిమిది నెలల గర్భిణీ నోయిడా నుంచి జలౌన్ కు 200 కిలో మీటర్లు  ప్రయాణించి తన స్వస్థలానికి చేరుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంజు దేవి (25), ఆమె భర్త ఆశోక్ నోయిడాలో గత ఐదు సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. అంజు దేవి భర్త భవన కార్మికుడిగా పని చేస్తున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని మోడీ లాక్ డౌన్ విధించాడు. నోయిడాలో ఉంటే కరోనా వ్యాపిస్తుందనే భయంతో నోయిడా నుంచి బయలు దేరారు. ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న అంజుదేవి తన భర్తతో కలిసి రెండు రోజులు పాటు 200 కిలో మీటర్లు ప్రయాణించి తన సొంతూరు జలౌన్ జిల్లాలోని అంటా గ్రామానికి చేరుకున్నారు. కమ్యూనిటి హెల్త్ సెంటర్ సభ్యులు 14 రోజులు క్యారెంటైన్‌లో ఉంచారు. వాళ్లకు కరోనా సోకలేదని నిర్ధారించుకున్న తరువాత ఇంటికి పంపించారు. నిండు గర్భవతి అయిన మంజును రెండు వందల కిలో మీటర్లు ప్రయాణించి వచ్చినందుకు గ్రామస్థులు ప్రశంసించారు. తాము ప్రయానిస్తున్నప్పుడు స్థానికులు తమకు భోజనం ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా  రోటి, సబ్జి తినుకుంటూ రెండు రోజులు పాటు ప్రయాణం చేసి తన సొంతూరుకు చేరుకున్నామని అంజు దేవి తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో కంట్రాక్టర్ తమకు కూలీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశాడని ఆశోక్ మీడియాకు తెలిపాడు.

 

Pregnant woman walks 200 km from noida to Jalaun,eight months pregnant, covered the distance in two days and two nights and reached her village on Sunday
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News