Saturday, April 20, 2024

నిండు చూలాలుపై నిర్లక్ష్యం… నర్సింగ్ హోమ్ ముందు గర్భిణి ప్రసవం

- Advertisement -
- Advertisement -

Pregnant women delivery in Nursing home at UP

లక్నో:  వైద్య సిబ్బంది గర్భిణీ పట్ల నిర్లక్ష్యం వహించడంతో నర్సింగ్ హోమ్ ముందు నిండు చులాలు ప్రసవమైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సంబాల్ జిల్లా చౌందసీ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జర్నలిస్టు రవి భార్య తొమ్మిది నెలల ఉండడంతో పురిటి నొప్పులు వచ్చాయి. రాత్రి పది గంటల సమయంలో ఆమెను స్థానికంగా ఉన్న నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే ఇద్దరు వైద్యులు, ఆరుగురు వైద్య సిబ్బంది ఉన్నారు. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నామని అందుకే డెలవరీ చేయడం కుదరదని చెప్పారు. తాను జర్నలిస్టు అని హెచ్చరించినా కూడా వాళ్లు పట్టించుకోలేదు. భార్య పురిటినొప్పులతో బాధపడుతున్న వైద్యులు పట్టించుకోలేదు. తాను వీడియో తీస్తుండగా రవిపై వాళ్లు దాడి చేసి బయటకు నెట్టేశారు. దీంతో నర్సింగ్ హోమ్ ముందే ఆమె ప్రసవించింది. రవి స్థానిక పోలీస్ స్టేషన్‌లో సదరు నర్సింగ్ హోమ్‌లో పని చేసే వైద్యులు, సిబ్బందిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News